కర్ణాటకలో NIA దాడులకు వ్యతిరేకంగా PFI నిరసనలు

కర్ణాటకలో NIA దాడులకు వ్యతిరేకంగా PFI నిరసనలు

కర్ణాటకలో NIA దాడులకు వ్యతిరేకంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI)  నిరసనలు కొనసాగుతున్నాయి. PFI సభ్యులు హుబ్లీలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మొత్తం 50 మంది PFI, SDPI సభ్యులు రోడ్డుపై వాహనాలను అడ్డుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.

దీంతో ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో NIA, ED దాడులు జరిగాయి. ఇప్పటికే మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో దాడులకు వ్యతిరేకంగా.. గురువారం నుంచే PFI పార్టీ సభ్యులు నిరసనలు చేపట్టారు. కర్ణాటక పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు.