హైదరాబాద్, వెలుగు: సనత్నగర్టిమ్స్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్పీ) కింద ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న పీజీ డాక్టర్లను టిమ్స్‌కు రీపోస్టింగ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సైతం దీనిపై ఆదేశాలు ఇస్తూ, సంబంధిత విద్యార్థులందరూ వెంటనే టిమ్స్ నోడల్ ఆఫీసర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
డీఆర్సీలో భాగంగా 2024–-25 బ్యాచ్‌కు చెందిన మూడో విడత విద్యార్థులు ప్రస్తుతం టీవీవీపీ హాస్పిటల్స్, తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ హాస్పిటల్, నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేవలను ఇకపై టిమ్స్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
