పీజీ సీట్లకు మరోసారి మాప్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌

పీజీ సీట్లకు మరోసారి మాప్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌

హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ సీట్ల కన్వీనర్ కోటా మాప్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌ను కాళోజీ హెల్త్ వర్సిటీ రద్దు చేసింది. దీంతో ఈ రౌండ్ మరోసారి జరగనుంది. ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్ కోటాలో అనర్హులకు సీట్లు కేటాయించిన వర్సిటీ, ఈ విషయం బయటకు పొక్కడంతో కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థుల సర్వీస్ సర్టిఫికెట్లను రీవెరిఫై చేస్తున్నామని,  ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తామని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఉస్మానియాలో నాన్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన సర్వీస్ కోటా సీటు అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తూ ఆదివారం రాత్రి  వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. 

అయితే, ఇంకా ఇలా ఎంత మంది నకిలీ సర్టిఫికెట్లతో సీట్లు పొందారో తేల్చాలని, ఇందుకోసం సర్వీస్ సర్టిఫికెట్లను రీవెరిఫై చేయాలని మెడికోలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మాప్‌‌‌‌‌‌‌‌అప్‌‌‌‌‌‌‌‌ రౌండ్ సీటు అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్ మొత్తాన్ని రద్దు చేస్తూ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్, సెకండ్ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌ కోటా కింద సీట్లు పొందిన వారి సర్టిఫికెట్లను సైతం రీవెరిఫై చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.