TS PGECET 2025: తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలొచ్చాయి.చెక్ చేసుకోండిలా

TS PGECET 2025: తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలొచ్చాయి.చెక్ చేసుకోండిలా

తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం (జూన్​26) జవహర్​ లాల్​ నెహ్రూ యూనివర్సిటీ, తెలంగాణ హయ్యర్​ ఎడ్యుకేషన్​ అధికారులు పీజీఈసెల్​ ఫలితాలను విడుదల చేశారు. పీజీఈసెట్​ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

తెలంగాణ పీజీఈసెట్ (TS PGECET) 2025 ఫలితాలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఈ ఫలితాలను గురువారం సాయంత్రం 3:30 గంటలకు విడుదల చేసింది. 

పీజీఈసెట్​ అధికారిక వెబ్‌సైట్‌ pgecet.tgche.ac.in లేదా pgecet.tsche.ac.in ద్వారా TS PGECET 2025 ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హోమ్‌పేజీలో Download rank card, TG PGECET 2025 Results లింక్‌పై క్లిక్ చేసి ర్యాంక్​ కార్డు పొందవచ్చు. ర్యాంకు కార్డును PDF ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ఒక ప్రింటౌట్ తీసుకోవాలి. మీరు మీ ఫలితాలను manabadi.co.in లేదా sakshieducation.com వంటి ఇతర విద్యా పోర్టల్స్‌లో కూడా చెక్​ చేసుకోవచ్చు. 

తెలంగాణ పీజీఈసెట్​ పరీక్షను జూన్​ 16నుంచి 19 వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు. PGECET లో అర్హత సాధించిన అభ్యర్థులు ME, M.Tech, M.Pharm కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.