
ముంబై: ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో బలమైన లాభాలు, విదేశీ నిధుల ప్రవాహం కారణంగా వరుసగా రెండో రోజు కూడా బెంచ్‌మార్క్ సెన్సెక్స్ లాభపడింది. ఇది 329 పాయింట్లు దూసుకెళ్లి 82,500.82 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడ్‌లో 482.01 పాయింట్లు పెరిగి 82,654.11 గరిష్ట స్థాయిని తాకింది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 103.55 పాయింట్లు ఎగసి 25,285.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 148.95 పాయింట్లు పెరిగి 25,330.75 గరిష్ట స్థాయిని తాకింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడం, భారత్–-యూఎస్వాణిజ్య ఒప్పందంలో పురోగతి సంకేతాలు వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.
సెన్సెక్స్ కంపెనీలలో ఎస్బీఐ 2.16 శాతం పెరిగి టాప్గేనర్గా నిలిచింది. మారుతి సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బీఈఎల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా , పవర్ గ్రిడ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల తర్వాత టీసీఎస్ 1.10 శాతం తగ్గింది.
రంగాల వారీగా పనితీరు
రియల్టీ 1.72 శాతం, టెలికమ్యూనికేషన్ 1.13 శాతం, హెల్త్‌కేర్ 0.99 శాతం, యుటిలిటీస్ 0.98 శాతం, బ్యాంకెక్స్ 0.97 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.71 శాతం, పవర్ 0.70 శాతం పెరిగాయి. మెటల్, కమోడిటీస్, ఆయిల్ గ్యాస్, ఫోకస్డ్ ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ. 1,308.16 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.63 శాతం తగ్గి 64.81 డాలర్లకు చేరింది.