డాక్టర్ రెడ్డీస్, లుపిన్ మందులు వెనక్కి

డాక్టర్ రెడ్డీస్, లుపిన్ మందులు వెనక్కి

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్,  లుపిన్.. తయారీ సమస్యల కారణంగా యూఎస్​లోని ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నాయి.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డ్రగ్ కంపెనీకి చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్  ఇబుప్రోఫెన్ టాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వెనక్కి రప్పిస్తోందని యూఎస్​ హెల్త్ రెగ్యులేటర్ తెలిపింది.  ఇబుప్రోఫెన్ మాత్రలను నొప్పి,  జ్వరం నుంచి ఉపశమనం కోసం సూచిస్తారు.   

న్యూజెర్సీకి చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబ్స్​ 1,03,298 బాటిళ్లను (800 ఎంజీ) రీకాల్ చేస్తోంది. వీటిలో మలినాలు ఉండటమే రీకాల్​కు కారణమని తెలిపింది.    ఈ ఏడాది ఆగస్టు 6న క్లాస్–2 దేశవ్యాప్తంగా రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ ప్రారంభించింది.  లుపిన్ 4,554 సీఫిగ్జిమ్ బాటిళ్లను రీకాల్ చేస్తున్నట్లు యూఎస్​ఎఫ్​డీఏ పేర్కొంది. ఇది ఆగస్టు 21న క్లాస్–2 రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.