బామ్మకి ముద్దిచ్చి షాప్ దోచేసిన దొంగ

బామ్మకి ముద్దిచ్చి షాప్ దోచేసిన దొంగ

దొంగతనానికి వచ్చినోళ్లు అంతా సర్దేసుకుని పోతారు. సహజం.. కానీ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ దొంగ చేసిన పని సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో మస్తు వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతోంది. హెల్మెట్లు పెట్టుకుని, చేతిలో గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇద్దరు దొంగరు ఓ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులోకి దూరారు. ఆ సమయంలో షాపు యజమానితోపాటు మందులు కొనేందుకు వచ్చిన ఓ ముసలామె మాత్రమే ఉన్నారు. ఓ దొంగ రెండు చేతుల్లో గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకుని నిల్చోగా రెండోవాడు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బెదిరించి కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డబ్బు మొత్తం బ్యాగులో వేసుకున్నాడు.

గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతపట్టుకున్న దొంగ పక్కనే నిల్చున్న ముసలామె.. తననేమైనా చేస్తారన్న భయంతో వణుకుతూ తన దగ్గరున్న డబ్బును తీసి ఆ దొంగకు ఇవ్వబోయింది. కానీ ఆ దొంగబాబు మాత్రం ఆమె డబ్బును తీసుకోలేదు. హెల్మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైకెత్తి ఆమె నుదుటిపై కిస్సు పెట్టాడు. ఆ తర్వాత తన భుజం తట్టి ధైర్యం కూడా చెప్పాడు. దుకాణంలోని కొన్ని వస్తువులతో పాటు 240 డాలర్ల క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దొంగలు దోచుకెళ్లారు. సీసీ టీవీలో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసినోళ్లంతా దొంగల్లోనూ కొందరు మంచిదొంగలుంటారన్నమాట.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి