గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్సిటీలోని ఇన్నర్ రింగ్‌రోడ్‌పై కలెక్టర్సత్య శారద కుడా చైర్మన్ వెంకట్రామి రెడ్డి, వైస్చైర్పర్సన్చాహత్బాజ్పాయ్తో కలిసితో కలెక్టరేట్లో గురువారం రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డుకు సంబంధించి పెండింగ్బిల్లులు క్లియర్ చేయాలని, ఫేజ్–-1 పనులను పూర్తి చేయాలని, ఫేజ్–-2కు భూసేకరణ త్వరగా చేపట్టాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమస్వయంతో పని చేయాలని చెప్పారు.
జిల్లాలోని ఇటుక బట్టీలు, కర్మాగారాల్లో పని చేస్తున్న వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. కొందరికి ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. అటువంటి పిల్లలను గుర్తించి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీడబ్ల్యూవో రాజమణి, డీఈవో రంగయ్య నాయుడు, డీఎంహెచ్ వో సాంబశివరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వసుధ పాల్గొన్నారు.
