
బషీర్బాగ్, వెలుగు: ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఓ పీహెచ్డీ స్కాలర్ను పుణే పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన సీతయ్య లండన్లో రెండు యూనివర్సిటీల్లో పీహెచ్డీలు చేశాడు. స్వదేశం తిరిగొచ్చాక పలు వ్యాపారులు చేస్తూ లాస్ అయ్యాడు. దీంతో ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో తనకు పరిచయం ఉందంటూ.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులను ఇప్పిస్తానని పుణేలోని రెండు యూనివర్సిటీల వీసీలతో ఒప్పందం చేసుకున్నాడు.
ముందుగా కొంత డబ్బును వారి అకౌంట్ల నుంచి తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్చేయించుకున్నాడు. తర్వాత స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన వీసీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, సీతయ్యను గురువారం హైదరాబాద్లో అరెస్ట్ చేసి, పుణేకు తీసుకెళ్లారు. అతను గతంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటుపడి, సుమారు రూ.కోటి పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు.