
న్యూఢిల్లీ: వరుసగా ఐదు ఓటములతో ఐపీఎల్16ను ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత అద్భుతంగా ఆడుతోంది. చివరి ఐదింటిలో నాలుగు గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. గత పోరులో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ ఇప్పుడు స్టార్లతో నిండిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును దెబ్బకొట్టింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (45 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 87) సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోవడంతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది.
టాస్ నెగ్గిన ఆర్‌సీబీ తొలుత 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (46 బాల్స్‌లో 5 ఫోర్లతో 55) ఫామ్ కొనసాగించగా.. మహిపాల్ లామ్రోర్ (29 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్) మెరుపు ఫిఫ్టీతో సత్తా చాటాడు. తొలుత విరాట్, కెప్టెన్ డుప్లెసిస్ (32 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) తొలి వికెట్‌కు 85 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. మిచెల్ మార్ష్ (2/21) ఒకే ఓవర్లో డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0)ను ఔట్ చేసినా.. కోహ్లీతో మూడో వికెట్‌కు 55 రన్స్ జోడించిన లామ్రోర్ చివర్లో దినేశ్ (11), అనుజ్ (8 నాటౌట్)తో కలిసి మెరుపులు మెరిపించి మంచి స్కోరు అందించాడు.
ఛేజింగ్‌లో సాల్ట్ జోరుతో క్యాపిటల్స్ 16.4 ఓవర్లలోనే 187/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. స్టార్టింగ్ నుంచే సాల్ట్ చెలరేగి ఆడటంతో మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (22), మిచెల్ మార్ష్ (26), రిలీ రొసో (35 నాటౌట్)తో తొలి మూడు వికెట్లకు వరుసగా 60, 59, 52 రన్స్ పార్ట్‌నర్‌షిప్స్‌తో ఢిల్లీ విజయానికి బాటలు వేశారు. సెంచరీ దిశగా సాగిన అతడిని కర్ణ్ శర్మ ఔట్ చేసినా.. అక్షర్ (8 నాటౌట్)తో రొసో మరో 20 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ ముగించాడు. ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విక్టరీతో ఢిల్లీ తొమ్మిదో ప్లేస్‌కు వచ్చింది.
కోహ్లీ@ 7000 రన్స్
ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 7 వేల రన్స్ క్లబ్లో చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. 2008 నుంచి ఆడిన 233 మ్యాచ్‌ల్లో అతను ఈ మార్కు చేరుకున్నాడు. ఫ్యామిలీ, చిన్ననాటి కోచ్ సమక్షంలో, తన క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన ఢిల్లీ స్టేడియంలో ఇది తనకు స్పెషల్ మూమెంట్ అని కోహ్లీ చెప్పాడు.