రాజీనామా చేయండి..ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ఫోన్ కాల్

రాజీనామా చేయండి..ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ఫోన్ కాల్

మునుగోడు ఉప ఎన్నికతో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్లు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తరచూ ఫోన్లు వస్తున్నాయి. రాజీనామా చేస్తేనే తమ ఊరుతో పాటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. ఈ కాల్స్పై కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్కు కూడా రాజీనామా చేయాలని ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. 

సారు రాజీనామా చేయండి..
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సార్ మీరు కూడా రాజీనామా చేయండి..నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కోరాడు. ఇందిరా కాలనీకి చెందిన నాగార్జున శంకర్ నాయక్కు ఫోన్ చేశాడు. మహబూబాబాద్ పట్టణంలో అభివృద్ధి లేదని..రాజీనామా చేస్తే డెవలప్ అవుతుందన్నాడు. అయితే శంకర్ నాయక్ ఫోన్ను ఆయన పీఏ ఎత్తి సమాధానం చెప్పాడు. ఆఫీసుకు వచ్చి బాధలు, కష్టాలు సార్తో చెప్పుకోవాలని పీఏ సమాధానం ఇచ్చాడు. 

నాగార్జున: ఓటరు  హలో సార్..

శంకర్ నాయక్ పీఏ: అన్న చెప్పే ఎవరన్నా..

నాగార్జున:సార్ లేడా సార్..

శంకర్ నాయక్ పీఏ: అన్న ఎవరన్నా మాట్లాడేది...

నాగార్జున: ఇందిరా కాలనీ నుంచి నాగార్జున్ మాట్లాడుతున్న.. సార్ తో పనిఉండే..

శంకర్ నాయక్ పీఏ:  సార్ పూజలో ఉన్నారు ఇవాళ గ్రహణం కదా..

నాగార్జున: ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా రాజీనామా చేస్తే అయిపోతుంది కదా..దళిత బంధు లేదు..అభివృద్థి లేదు..

శంకర్ నాయక్ పీఏ: సరేనే..ఆఫీసుకు రండి..

నాగార్జున:సారుకే డైరెక్ట్ చెప్తా..రాజీనామా చేస్తే అయిపోతుందని..డబుల్ బెడ్ రూం ఇండ్లు లేవు..దళితబంధు లేదు..కాల్వలు లేవు..ఏందీ కథ.. మా కథ..

శంకర్ నాయక్ పీఏ:  ఆఫీసుకు రా అన్న..నాగార్జున అన్న..

నాగార్జున:అ వస్త..థాంక్యూ అన్న..వస్త

శంకర్ నాయక్ పీఏ:  ఆఫీసుకు వచ్చి మీ బాధలు, కష్టాలు సార్తో చెప్పుండ్రి..

నాగార్జున: మా బాధలు చెప్పడానికి ఆఫీసుకే రావాలా..? అవసరం కోసం ఆఫీసు రండి అంటున్నారు..రేపు పొద్దున అవసరం ఉన్నోళ్లుఓట్లేస్తేనే గెలుస్తాడా..?