పదేళ్లలో ఫోన్ల తయారీ 21 రెట్లు పైకి

 పదేళ్లలో ఫోన్ల తయారీ 21 రెట్లు పైకి
  •     2023-24 లో రూ. 4.1 లక్షల కోట్లకు చేరుకున్న ప్రొడక్షన్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ గత పదేళ్లలో 21 రెట్లు పెరిగింది. వాల్యూ పరంగా, 2014–15 లో రూ.18,900 కోట్ల విలువైన ఫోన్లు తయారైతే 20‌‌‌‌‌‌‌‌23–24 లో ఏకంగా రూ.4.1 లక్షల కోట్ల విలువైన ఫోన్లు తయారయ్యాయని ఇండియా సెల్యూలర్‌‌‌‌‌‌‌‌ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వం తెచ్చిన పీఎల్‌‌‌‌ఐ వంటి స్కీమ్‌‌‌‌లు గ్లోబల్‌‌‌‌ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. 

దేశంలోని  మొబైల్ ఫోన్స్ డిమాండ్‌‌‌‌లో 97 శాతాన్ని లోకల్‌‌‌‌గా తయారైన ఫోన్లే  తీరుస్తున్నాయని  తెలిపింది. 2023–24 లో  తయారైన మొత్తం ఫోన్లలో 30 శాతం ఎగుమతయ్యాయని ఐసీఈఏ వివరించింది. 20‌‌‌‌‌‌‌‌14–15 లో కేవలం రూ.1,556 కోట్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,20,000 కోట్ల విలువైన ఫోన్లు ఎగుమతి అయ్యాయని ఐసీఈఏ అంచనా వేసింది. ఇది 7,500 శాతం గ్రోత్‌‌‌‌కు సమానం.