ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకే ముప్పు

ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకే ముప్పు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల హక్కులను హరిస్తున్నాయిన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకే ముప్పన్నారు. పౌరుల హక్కులపై మాట్లాడేవారిపై దేశ ద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను దొంగచాటుగా వింటూ అధికారంలోకి రావాలనే కుట్రలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దేశపౌరుల సమాచారాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా లు విదేశీయుల చేతుల్లో పెడుతూ భద్రతకే ముప్పు తెస్తున్నారన్నారు. పవిత్రమైన పార్లమెంట్ లో ఆక్సిజన్ అందక ఎవరు చనిపోలేదంటూ పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. వారికి దొంగచాటుగా అధికారంలోకి రావాలనే తపన తప్ప ప్రజల సమస్యలపై పట్టింపులేదని ఆరోపించారు. తప్పుడు పనులు చేస్తూ రామరాజ్యం అంటూ సిగ్గులేనిమాటలు మాట్లాడుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సర్వే పేరుతో చేసిన సర్వే రికార్డులు దగ్గరపెట్టుకుని.. ఇష్టారీతిన భూముల ధరలు పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క.