
దీపాల పండుగ దీపావళి. అయితే భారత ఇతిహాసాల్లో కూడా దీపావళికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మహాలక్ష్మి పూజ నుంచి టపాకాయలు కాల్చటం వరకు ఆరోజు ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. అయితే దీపావళికి టపాసులు పేల్చే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. చాలా సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సమయాల్లో అశ్రద్ధ వల్ల అగ్ని ప్రమాదాలు, ఆస్థి నష్టాలకు కూడా కారణం అవుతుంటాయి. అందుకే ఇలాంటి అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ పొందటానికి ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అదనపు భద్రతగా నిలుస్తుంది.
ఇంకొద్ది రోజుల్లో దీపావళి వస్తుండటంతో దేశంలోని అతిపెద్ద ఫిన్ టెక్ పేమెంట్ సంస్థ ఫోన్ పే తన ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ఖర్చుకే అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.11 ఖర్చుతో రూ.25వేల వరకు ప్రమాద బీమాను ఆఫర్ చేస్తోంది కంపెనీ. ఇది కుటుంబంలోని భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలకు కవర్ చేసే సింగిల్ పాలసీ అని కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ 12 నుంచి ఇది అందుబాటులో ఉండగా ప్రజలు దీనిని కొన్న రోజు నుంచి 11 రోజుల వరకు కవరేజ్ అందించబుడుతుందని వెల్లడైంది. అంటే జస్ట్ రోజుకు రూపాయి ఖర్చుతో ఇన్సూరెన్స్ అన్నమాట.
ఫోన్ పే నుంచి ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు వివరాలు..
1. ముందుగా మీరు వాడుతున్న ఫోన్ పే యాప్ కి వెళ్లి అక్కడ ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలి.
2. అందులో రూ.11కే జీఎస్టీతో కలిపి రూ.25వేలు కవరేజ్ ఆఫర్ చేస్తున్న ప్లాన్ ఎంచుకోవాలి.
3. తర్వాత ఇన్సూరెన్స్ కోసం వ్యక్తుల వివరాలు అందించి పేమెంట్ పూర్తి చేయాలి. ఈ క్రమంలో దేనికి ఎంత ఖర్చనే బ్రేక్ డౌన్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది.