పల్లిపట్టిలా ఉంది.. ఏందిది..!

పల్లిపట్టిలా ఉంది.. ఏందిది..!

పల్లిపట్టి సూపర్ ఉంది.. చూస్తేనే నోరూరిపోతోంది.. లాగించేద్దాం అనుకుంటున్నారా? అలా చేశారనుకోండి.. మాడిపోతారు. మసైపోతారు. ఫస్ట్​ అసలు దాన్ని పట్టుకో లేరు కూడా! ఎందుకంటే.. అది సూర్యుడు మరి. హవాయిలోని ఇనూయి సోలార్ టెలిస్కోప్ భగభగమండే సూర్యుడిని క్లిక్ మనిపించింది. సూర్యుడిని కప్పేసిన హాట్ హాట్ ప్లాస్మా పొరలట ఇవి. టెలిస్కోపు క్లిక్
మనిపించిన ఈ ఫొటోలను అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ ఎస్ ఎఫ్ ) స్టడీ చేసింది. సూర్యుడిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భూమిపై దాని ప్రభావం ఏంటో తెలుసుకోవడానికి ఈ ఫొటోలు హెల్ప్​ చేస్తాయని సైంటిస్టులు అంటున్నారు. ఆ ఇనూయి టెలిస్కోపును ఎన్ ఎస్ ఎఫ్ ఆపరేట్ చేస్తోంది.

సూర్యుడి కరోనాలోని అయస్కాంత క్షేత్రాలను ఆ టెలిస్కోపు ఈజీగా మ్యాప్ చేయగలుగుతుందని చెబుతున్నారు. అంతేగాకుండా స్పేస్ వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇనూయి ఉపయోగపడుతుందని, తద్వారా సౌర తుఫాన్లను మరింత బాగా అంచనా వేయడానికి వీలవుతుందని అంటున్నారు. ఆ ఫొటోలను, వీడియోలను ఎన్ ఎస్ ఎఫ్ రిలీజ్ చేయడంతో నెటిజన్లు.. అచ్చం ఇండియన్ పల్లిపట్టిలా ఉందని జోకులు పేలుస్తున్నారు. సూర్యుడి ఫొటోలకు పల్లిపట్టిలను జత చేసి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు.

 More News

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం