మిథిలా యూనివర్సిటీలో ఘటన

మిథిలా యూనివర్సిటీలో ఘటన

పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ఫొటోలతో ఉన్న అడ్మిట్ కార్డులను బీహార్‌‌‌‌లో లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ జారీ చేయడం వివాదాస్పదమైంది. దర్భంగాలో వర్సిటీ పరిధిలోని మధుబని, సమస్తిపూర్, బెగుసరయ్ జిల్లాల్లోని కాలేజీల్లో బీఏ పార్ట్‌‌ 3 పరీక్షల సందర్భంగా ఈ ఘటన జరిగింది. ‘‘దీనిపై విచారణకు ఆదేశించాం. సంబంధిత స్టూడెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఎఫ్‌‌ఐఆర్ కూడా నమోదు చేయించే అవకాశం ఉంది’’ అని రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ చెప్పారు.

‘‘అడ్మిట్ కార్డులను ఆన్‌‌లైన్‌‌లో జారీ చేశాం. వాటిని స్టూడెంట్లు డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. అందరికీ యూనిక్ లాగిన్ వివరాలు ఇచ్చాం. స్టూడెంట్లు ఫొటోలు, ఇతర వివరాలను అప్‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని మా డేటా సెంటర్‌‌‌‌లో ప్రాసెస్ చేసి, అడ్మిట్ కార్డులను ప్రిపేర్ చేస్తారు. కానీ స్టూడెంట్లలో కొందరు బాధ్యతారహితమైన దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తున్నది’’ సీరియస్ అయ్యారు. ఈ చర్యల వల్ల వర్సిటీకి చెడ్డపేరు వచ్చిందని రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ అన్నారు.