Physics Wallah Telugu OTT: విద్యార్థుల కోసం గురువు చేసిన పోరాటం.. OTTకి వచ్చేసిన గొప్ప సినిమా

Physics Wallah Telugu OTT: విద్యార్థుల కోసం గురువు చేసిన పోరాటం.. OTTకి వచ్చేసిన గొప్ప సినిమా

చాలా మంది తమ లైఫ్ లో మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు  చూసి ఉంటారు. కానీ, వాటిలో కొన్ని  మాత్రమే గొప్పవి అనే భావనని కలిగిస్తాయి. వాటిలో ఫిజిక్స్ వాలా సినిమా ఒకటి. ఈ సినిమా చూసిన తరువాత ఒక గొప్ప సినిమా చూశాము అనే ఫీలింగ్ రావడం ఖాయం. అవును.. ఫిజిక్స్ వాలా సినిమా ప్రేక్షకులకు అలాంటి అనుభూతిని కలిగిస్తుంది, ఆలోచింపజేస్తుంది. నిజానికి ఈ సినిమా 2022లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

ఇప్పుడు ఇంతకాలానికి ఈ సినిమాను తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిజిక్స్ వాలా అనగానే ఇదేదో సైన్స్ కి సంబందించిన సినిమా అని అనుకుంటారు చాలా మంది. కానీ. ఇది ఒక ఉపాధ్యాయుడి కదా. ప్రస్తుతం కాలంలో కార్పొరేట్ విద్యాలయాల వల్ల విద్యార్థులు పడుతున్న మానసిక సంఘర్షణ, అది భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వాటిపై పోరాడిన ఒక ఉపాధ్యాయుడి కథే ఈ సినిమా.

విద్యావిధానంలో మార్పుల కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరికి తాను అనుకున్నది చేయగలిగాడా అనేది మిగిలిన కథ. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్స్, కాలేజ్ బ్యాక్డ్రాప్ లో అల్లుకున్న కంటెంట్ కాబట్టి అందరికీ ఈ సినిమా ఈజీగా కనెక్ట అవుతుంది. మీలో ఎవరైనా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.