మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో పర్యటించారు. పొలాలకు నీటి సమస్యపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు కేసీఆర్.
అయితే కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ కార్యకర్తలు, జనాలు భారీగా తరలివచ్చారు. అయితే కొందరు దొంగలు ఇదే అదనుగా చేతివాటం చూపించారు. జేబుల్ కట్ చేశారు. మొగ్ధుమ్ పూర్ సర్పంచ్ జేబు నుంచి 25 వేలు, దురుషేడ్ ఉప సర్పంచ్ సంపత్ రావ్ ల జేబులో నుంచి రూ. 15 లు కొట్టేసారు జేబు దొంగలు.
మొగ్దుంపూర్ పర్యటన అనంతరం కేసీఆర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో లంచ్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లికి బయల్దేరుతారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. ఆపై శభాష్ పల్లి దగ్గర మిడ్ మానేరు రిజర్వాయర్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు తిరుగు పయణమవుతారు.