కుటుంబంతో విహారయాత్రకు బయల్దేరిన మెగాస్టార్ చిరంజీవి

కుటుంబంతో విహారయాత్రకు బయల్దేరిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి విహారయాత్రకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో పాటు హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి వెళ్తున్న పిక్ ను పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ తో పాటు ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర అనే క్యాప్షన్ ను చిరు జత చేశారు.

గాడ్ ఫాదర్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న  వాల్తేర్ వీరయ్య మూవీ షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా... జనవరి 13న రిలీజ్ కానున్నట్టు చిత్ర నిర్వాహకులు ఇటీవలే ప్రకటించారు. కాగాఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్నారు.