కొత్త సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదంపై హైకోర్టులో పిల్

కొత్త సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదంపై హైకోర్టులో పిల్

కొత్తగా నిర్మించిన సెక్రటేరియెట్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్ కు పాల్ విన్నవించారు. దీనిపై స్పందించిన సీజే.. పాల్ పిటిషన్ కు  నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్ కు ఆదేశించారు. ఈ పిల్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది. 

ఫిబ్రవరి 3న నిర్మాణంలో ఉన్న కొత్త సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ ప్రధాన గోపురం నుంచి దట్టమైన పొగలు రావడంతో.. అక్కడ పని చేస్తున్న కార్మికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి.