సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టులో పిల్

సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టులో పిల్

హైద‌రాబాద్:  సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేశారు ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని పేర్కొన్నారు పిటిషనర్. భవనాల కూల్చివేయడం వల్ల‌ వాతావరణ కాలుష్యం అవుతుందన్నారు. మున్సిపాలిటీ సాలీడ్ వెస్ట్ మ్యానేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నట్లు కోర్టుకు తెలుపుతూ పిటిషన్ దాఖ‌లు చేశారు ప్రొఫెస‌ర్ పి.ఎల్ విశ్వేశ్వ‌ర్ రాదు. 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలికి కూల్చివేతల వలన ఆటంకాలు కలుగుతుందన్న హైకోర్టు..ప్రస్తుతం అత్యవసరంగా విచారించలేమని తెలిపింది హైకోర్టు. ఇందుకు సంబంధించిన విచార‌ణ తేదీని త్వ‌ర‌లోనే చెబుతామంది హైకోర్ట్.