ఫాంహౌజ్ కేసు: మరోసారి మాదాపూర్ పోలీసులకు రోహిత్ రెడ్డి ఫిర్యాదు

ఫాంహౌజ్ కేసు: మరోసారి మాదాపూర్ పోలీసులకు రోహిత్ రెడ్డి ఫిర్యాదు

ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు  కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి  మాదాపూర్ పోలీసులకు  కంప్లైంట్ చేశారు. ఫాంహౌజ్  కేసు తర్వాత  తనకు వస్తున్న బెదిరింపులపై  ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని  నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని  మాదాపూర్  ఏసీబీకి  ఫిర్యాదు చేశారు. 

మరోసారి ఫాంహౌజ్ ను పరిశీలించనున్న సిట్

 ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఆడియో రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే  హైదరాబాద్ లో నిందితుడు నందకుమార్ కు చెందిన హోటల్, ఇంట్లో తనిఖీలు  చేశారు అధికారులు. కీలక ఆధారాల కోసం మొయినాబాద్ అజీజ్ నగర్ లోని ఫామ్ హౌస్ ను మరోసారి పరిశీలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల ఫోన్ లోని కాంటాక్ట్స్ లో అనుమానిత నెంబర్స్ గురించి ఆరా తీశారు. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల నెంబర్లు ఉన్నట్లు  తెలుస్తోంది. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు.