సారీ చెప్పండి..విదేశీ మీడియా సంస్థలకు పైలట్ల సంఘం నోటీసులు

సారీ చెప్పండి..విదేశీ మీడియా సంస్థలకు పైలట్ల సంఘం నోటీసులు
  • అహ్మదాబాద్​ ప్లేన్​ క్రాష్​పై తప్పుడు ఆర్టికల్స్​ రాశారని ఫైర్​

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదాలు, కాక్ పిట్ గందరగోళమే కారణమంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్  కథనాలు ప్రచురించాయంటూ ఫెడరేషన్​ఆఫ్​ ఇండియన్​ పైలట్స్ (ఎఫ్ఐపీ) మండిపడింది. తప్పుడు కథనాలు రాసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తూ ఆ రెండు సంస్థలకూ నోటీసులు పంపించింది.

 క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా ముందుకెళ్తామని ఆ రెండు విదేశీ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చినట్టు ఎఫ్ఐపీ ప్రెసిడెంట్ కెప్టెన్ సీఎస్​ రంధావా వెల్లడించారు. ప్రమాదంపై ఓవైపు విచారణ జరుగుతుండగానే.. పైలట్ తప్పిదమే కారణమంటూ రాయిటర్స్, వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీట్​ జర్నల్​ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుగా ఆపాదించాయని పైలట్ల సంఘం మండిపడింది.

ఆందోళనకు గురిచేసేలా వార్తలు వద్దు

 భారీ విమాన ప్రమాదంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని ఎఫ్ఐపీ నోటీసుల్లో పేర్కొన్నది. దీనిపై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్​యాక్సిడెంట్​ఇన్వెస్టిగేషన్​ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో భారత విమానయాన పరిశ్రమ భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన కలిగించేలా కథనాలు ప్రచురించొద్దని కోరింది. 

ఇన్వెస్టిగేషన్​ జరుగుతుండగా ఇలాంటి కథనాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నది. మీడియా జర్నలిస్టిక్ సమగ్రతను కాపాడాలని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది.