ప్రమోషన్ల తర్వాత స్పౌజ్ బదిలీలు: సబితా రెడ్డి

ప్రమోషన్ల తర్వాత స్పౌజ్ బదిలీలు: సబితా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మిగిలిపోయిన ఎస్​జీటీ స్పౌజ్ బదిలీలను టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ తర్వాత నిర్వహించేందుకు విద్యాశాఖ మంత్రి అంగీకరించినట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డిని టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో పాటు పీఆర్టీయూ నేతలు కలిశారు. 8 నెలలుగా నిలిచిపోయిన టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. 

 ఈ క్రమంలో స్పౌజ్ టీచర్ల బదిలీలపై ఆమె సానుకూలంగా మాట్లాడినట్లు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్​రావు తెలిపారు. సెప్టెంబర్1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించారని వారు తెలిపారు. టీచర్ల బదిలీలతో పాటు గతంలో అప్లై చేసిన వారికి ఎడిట్ చేసుకునేందుకు ఈ నెల 3 నుంచి మూడ్రోజుల పాటు సర్కారు అవకాశం కల్పించిందన్నారు.