
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఆదివారం సుధారెడ్డి ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండో ఎడిషన్ ‘పింక్ పవర్ రన్-2025’ జరిగింది. మిస్ వరల్డ్ సంస్థ అధ్యక్షురాలు జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాతతో పాటు మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఈ రన్లో పాల్గొన్నారు. దాదాపు 20,000 మంది రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం పరుగెత్తారు. – వెలుగు, ట్యాంక్‌బండ్