- మెయిల్ ఫౌండేషన్ ఫౌండర్ మేఘా సుధారెడ్డి
మాదాపూర్, వెలుగు: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు మేఘా ఇంజనీరింగ్ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్పవర్ రన్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఫౌండర్మేఘా సుధారెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని ఓ హోటల్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మిస్‌వరల్డ్–2025 ఓపల్సుచాత, మిస్ఏసియా–2025 కృష్ణ గ్రావిడ్జ్చీఫ్గెస్ట్లుగా హాజరయ్యారు. సుధారెడ్డి మాట్లాడుతూ.. రెండేండ్లుగా మెయిల్ఫౌండేషన్ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తిస్తే క్యాన్సర్ ను క్యూర్ చేయొచ్చని చెప్పారు. సెప్టెంబర్ 28 నెక్లెస్ రోడ్లో 2కె, 5కె,10కె పింక్ పవర్ రన్ ఉంటుందని, గ్రామీణ మహిళలు కూడా వస్తారని తెలిపారు. మిస్‌వరల్డ్ ఓపల్ సుచాత మాట్లాడుతూ.. తనకు 16 ఏండ్లప్పడు బ్రెస్ట్క్యాన్సర్వచ్చిందన్నారు. స్టార్టింగ్స్టేజ్లోనే గుర్తించడం వల్ల వ్యాధి నుంచి బయటపడ్డానని తెలిపారు. ఎలాంటి వ్యాధినైనా ముందుగా గుర్తిండమే ముఖ్యమని, అందుకే ఓపల్ ఫర్ హర్సంస్థ ద్వారా అవేర్నెస్కల్పిస్తున్నానని చెప్పారు. మిస్ ఏసియా కృష్ణ గ్రావిడ్జ్ మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎర్లీగా డిటెక్ట్చేస్తే బయట పడొచ్చని సూచించారు.
