
Sameeksha: దేశంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రుణ సంస్థల్లో ఒకటి పిరమిల్ ఫైనాన్స్. కంపెనీ మెుత్తం వ్యాపారంలో తెలంగాణ వాటా దాదాపు 10 శాతం వరకు ఉంది. తెలంగాణలో మెుత్తం రుణాల విలువ రూ.5వేల 200 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రధానంగా కస్టమర్ల వ్యాపారాన్ని అర్థం చేసుకోవటం వారి కుటుంబ ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రుణాల మంజూరుకు ముందుకెళుతుందని.. కేవలం సిబిల్ స్కోర్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోబోమని వెల్లడించింది.
బేసిక్ గా హోమ్ లోన్స్, ప్రాపర్టీపై లోన్స్, బిజినెస్ లోన్స్, అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ అందిస్తూ కస్టమర్లకు తమ ఆశయాలను నెరవేర్చుకోవటంలో సహాయం చేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య రుణాలు పొందుతున్న కస్టమర్లు తమకు ఎక్కువగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వ్యాపారం పెరుగుతున్నందున రానున్న కాలంలో రిటైల్ బ్రాంచ్ ల సంఖ్యను మరింతగా విస్తరించే ప్రణాళికలో ఉన్నామని.. అలాగే కస్టమర్లకు రుణం ఇచ్చే విషయంలో ఏఐ టూల్స్ కూడా వాడుతున్నట్లు వెల్లడించారు పిరమిల్ ఫైనాన్స్ ప్రతినిధులు.
ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకునేందుకు వారి వ్యాపారం, ఆదాయం, ఖర్చులను అంచనా వేసేందుకు రుణం కోసం సంప్రదించినప్పుడు వారి వ్యాపార స్థలానికి వెళ్లి వివరాలు కనుక్కుని, కొంత సమయం వారికి కేటాయిస్తామని అదే తమ బిజినెస్ మోడల్ సక్సెస్ అని కంపెనీ చెబుతోంది. అందుకే నిరర్థక రుణాల సంఖ్య మెుత్తం లోన్ పోర్ట్ ఫోలియోలో1 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
►ALSO READ | భారత్ అమెరికా మధ్య టారిఫ్స్ వార్.. సైలెంట్‌గా లాభం పొందుతున్న చైనా..!
తాజాగా కంపెనీ నిజ జీవితంలో ఒక వ్యక్తి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని ఎలా ముందుకు సాగి తన జీవిత లక్ష్యాలను చేరుకోవటానికి సంబంధించి 'సమీక్ష' పేరుతో ఒక డిజిటల్ సిరీస్ వీడియోను రూపొందించింది. ఇందులో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ యూట్యూబ్ తో పాటు జియో స్టార్, సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. ఇది ప్రజల్లో అవగాహనను పెంచటంతో పాటు తెలంగాణ ప్రజలకు తమను మరింత చేరువచేస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 517 బ్రాంచ్ లు ఉండగా రానున్న కాలంలో వీటిని వెయ్యికి పెంచే లక్ష్యంతో ఉన్నట్లు వారు వెల్లడించారు. తమ కష్టమర్లలో 80 శాతం మంది మెట్రోలకు సమీపంలోని టైర్ 2,3 ప్రాంతాలకు చెందినవారేనని కంపెనీ చెబుతోంది.