రెండేండ్లు కష్టపడి రూపొందించిన పిక్సల్ స్టార్టప్

రెండేండ్లు కష్టపడి రూపొందించిన పిక్సల్ స్టార్టప్

న్యూఢిల్లీ: స్పేస్​ టెక్​ స్టార్టప్ పిక్సల్​ రూపొందించిన మూడో హైపర్​ స్పెక్ట్రల్​ శాటిలైట్ ఆనంద్ శనివారం నింగిలోకి దూసుకుపోనుంది. ఈ శాటిలైట్​ను శ్రీహరికోటలోని స్పేస్​పోర్ట్​ నుంచి పోలార్ శాటిలైట్​ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్​ మోసుకుపోనుంది. ఆనంద్ అనేది కేవలం 15 కిలోల బరువు ఉండే మైక్రో శాటిలైట్. ప్రస్తుతం వాడుకలో ఉన్న నాన్​ హైపర్​ స్పెక్టికల్​ శాటిలైట్లు తీసే వాటి కంటే ఎక్కువ క్వాలిటీతో మన భూమి ఫొటోలను తీయగలదు. 

ఆనంద్​ శాటిలైట్ తీసే ఫొటోలు అడవిలో కార్చిచ్చులను గుర్తించడం, నేల ఒత్తిడి, చమురు తెప్పలను గుర్తించడం వంటి ఇతర విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని పిక్సెల్ వెల్లడించింది. ఇప్పటికే ఈ ప్రయోగానికి 18 నెలల ఆలస్యం జరిగిందని, తమ టీమ్​ రెండేండ్లకుపైగా కష్టపడిందని  పిక్సల్​ సీఈవో, ఫౌండర్ అవైస్ అహ్మద్​పేర్కొన్నారు.