దేశాన్ని దోచుకున్నోళ్లకు సబ్సిడీ లాభంగానే కనిపిస్తుంది

దేశాన్ని దోచుకున్నోళ్లకు సబ్సిడీ లాభంగానే కనిపిస్తుంది

రాహుల్ గాంధీకి పియూష్ గోయల్ కౌంటర్
న్యూఢిల్లీ: మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం లాభాలు ఆర్జించడంపై దృష్టి పెట్టించదని రాహుల్ గాంధీ శనివారం విమర్శించారు. శ్రామిక్ రైళ్ల ద్వారా రెవెన్యూ పెంచుకోవడంపై కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ పేదల వ్యతిరేక సర్కార్ అని రాహుల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ కామెంట్స్‌కు కౌంటర్‌‌గా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ దేశాన్ని దోచుకున్న వాళ్లకు సబ్సిడీ కూడా లాభంలా కనిపిస్తుందని మండిపడ్డారు.

‘దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే సబ్సిడీని లాభం అని పిలుస్తారు. స్టేట్ గవర్నమెంట్స్‌ నుంచి రాబట్టిన దాని కంటే శ్రామిక్ రైళ్లను నడపడానికి రైల్వేస్ చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులను వెచ్చించింది. ప్రజల టికెట్ల డబ్బులను చెల్లిస్తామన్న సోనియా జీ హామీ ఏమైందని అందరూ ప్రశ్నిస్తున్నారు’ అని పియూష్ ట్వీట్ చేశారు. వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించే సమయంలో శ్రామిక్ ట్రయిన్ ప్యాసింజర్స్‌ టిక్కెట్ డబ్బులను తమ పార్టీ చెల్లిస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ మాటలనే తాజాగా గోయల్ గుర్తు చేశారు.