ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఢిల్లీలో ఆందోళన నెలకొంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఈ యువకుడు పని చేస్తున్నాడు.
డెలివరీ బాయ్ దాదాపు వంద కుటుంబాలకు పిజ్జా డెలివరీ చేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు అధికారులు. అతను పిజ్జా డెలివరీ చేసిన కుటుంబాల వారందరినీ క్వారంటైన్ చేశారు. అలాగే అతని తో చేసే మిగిలిన పిజ్జా డెలివరీ బాయ్స్ ను కూడా క్వారంటైన్ కు తరలించారు.

