- అధ్యక్షురాలిగా పీకే శ్రీమతి, ప్రధాన కార్యదర్శిగా కనినిక
హైదరాబాద్, వెలుగు: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్షురాలిగా కేరళకు చెందిన సీనియర్ నాయకురాలు పీకే శ్రీమతి టీచర్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా 14వ జాతీయ మహాసభల్లో నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా బెంగాల్‌కు చెందిన కనినిక ఘోష్ బోస్, కోశాధికారిగా తపసి ప్రహరాజ్ ఎన్నికయ్యారు. 36 మందితో ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నట్టు సంఘం ప్రకటించింది. కాగా, జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి లక్ష్మీతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, నాయకులు ప్రభావతి, ఆశాలత, బండి పద్మ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీసభ్యులుగా ఎన్నికయ్యారు.
