తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ vs తమిళ్‌‌‌‌‌‌‌‌ తలైవాస్‌‌‌‌‌‌‌‌

తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ vs తమిళ్‌‌‌‌‌‌‌‌ తలైవాస్‌‌‌‌‌‌‌‌

ముంబై: ప్రో కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 12వ సీజన్‌‌‌‌‌‌‌‌ను నాలుగు సిటీల్లో నిర్వహించనున్నారు. ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ 29 నుంచి విశాఖపట్నం, జైపూర్‌‌‌‌‌‌‌‌, చెన్నై, న్యూఢిల్లీలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరగనున్నాయి. తొలి రోజున తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌.. తమిళ్‌‌‌‌‌‌‌‌ తలైవాస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ మొదలుకానుంది. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బెంగళూరు బుల్స్‌‌‌‌‌‌‌‌.. పుణెరి పల్టాన్‌‌‌‌‌‌‌‌తో తలపడనున్నాయి. 

మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ప్రారంభ వేడుకలు వైజాగ్‌‌‌‌‌‌‌‌లోని రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. పీకేఎల్‌‌‌‌‌‌‌‌ రెండో అంచె సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 12 నుంచి సవాయ్‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరుగుతుంది.  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 29 నుంచి జరిగే మూడో అంచె పోటీలకు చెన్నైలోని ఎస్‌‌‌‌‌‌‌‌డీఏటీ మల్టీపర్పస్‌‌‌‌‌‌‌‌ ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. చివరిదైన నాలుగో అంచె మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 13 నుంచి న్యూఢిల్లీ వేదికగా జరుగుతాయి.