విద్యార్థులు ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి : డాక్టర్ గడ్డం సరోజా వివేక్

విద్యార్థులు ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి : డాక్టర్ గడ్డం సరోజా వివేక్
  • అంబేద్కర్ కాలేజీలో ప్లేస్​మెంట్ డ్రైవ్‌‌ 
  • ఎంపికైన విద్యార్థులకు కరస్పాండెంట్ డా. సరోజా వివేక్​ అభినందన

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బి.ఆర్. అంబేద్కర్ (అటానమస్) కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ గడ్డం సరోజా వివేక్ సూచించారు. విద్యార్థుల జీవితానికి ప్లేస్​మెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ సంస్థ సహకారంతో బుధవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీలో ప్లేస్​మెంట్ డ్రైవ్ చేపట్టారు.

ఇంటర్మీడియట్ ఎంపీసీ, డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలకు చెందిన 127 మంది విద్యార్థులు పాల్గొనగా, రాత పరీక్ష, హెచ్‌‌ఆర్ ఇంటర్వ్యూ ఆధారంగా 15 మంది విద్యార్థులు ఆ సంస్థకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా సరోజా వివేక్ ఎంపికైన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళితే ప్రతి విద్యార్థి లక్ష్యానికి దగ్గర అవుతారని తెలిపారు. సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.