ఈ నెల 8 నుంచి గుళ్లు, హోటళ్లు, మాల్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌

ఈ నెల 8 నుంచి గుళ్లు, హోటళ్లు, మాల్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగురాష్ట్రంలో సోమవారం (ఈ నెల 8) నుంచి గుళ్లు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, మాల్స్​ను ఓపెన్​ చేసేందుకు సర్కారు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. ఈమేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కంటెయిన్మెంట్‌‌‌‌ జోన్లకు వెలుపల ఉన్న ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సర్వీసెస్‌‌‌‌, షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌ తెరుచుకోవచ్చని అందులో పేర్కొంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండే నైట్​ కర్ఫ్యూ టైంలో వీటిల్లోకి ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే మాల్స్‌‌‌‌లో ఉన్న గేమింగ్‌‌‌‌ జోన్లు, సినిమా హాళ్లను మాత్రం తెరవకూడదని ఆదేశించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. పబ్లిక్‌‌‌‌ ప్లేసులు, ఆఫీసుల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌‌‌‌ ధరించాలని, ఫిజికల్​ డిస్టెన్స్‌‌‌‌ పాటించాలని, వర్క్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌‌‌‌ చేయాలని సూచించింది. పెండ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కావొద్దని పేర్కొంది. 65 ఏండ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలు అత్యవసర వైద్య సేవల కోసం తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. కంటెయిన్మెంట్‌‌‌‌ జోన్లలో ఈ నెల 30 వరకు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ కంటిన్యూ అవుతుందని పేర్కొంది.

పీపీఈ కిట్లు ఇస్తే డాక్టర్లకు కరోనా ఎట్లొచ్చింది?