తిరువనంతపురం: కేరళ సీఎం పినరయ్ విజయన్ పెద్ద కూతురు వీణ పెళ్లి సోమవారం నిరాడంబరంగా జరిగింది. కరోనా రూల్స్ కారణంగా 50 మంది మించకుండా సీఎం నివాసంలో ఈ పెళ్లి జరిపించారు. కుటుంబ సభ్యులు, దగ్గరివారు మాత్రమే పెళ్లి కి వచ్చారు. కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ సీఎం ఇంటికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. ఉదయం 10.30 గంటలకు వధువు మెడలో వరుడు రియాజ్ తాళి కట్టారు. ఆ ఆ తర్వాత పెళ్లి ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. వరుడు రియాజ్ సీపీఐఎం స్టేట్ యూత్ విభాగానికి , డీవైఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్ గానూ ఉన్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే. వీణకు ఒకరు, రియాజ్ కు ఇద్దరు పిల్లలున్నారు. వీణ 2015 లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ను ఏర్పాటు చేసి దానికి ఎండీగా పనిచేస్తున్నారు. రియాజ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు. 2009 లో కోజికోడ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.


