
సంగారెడ్డిలో 130 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ MLA జగ్గారెడ్డి అన్నారు. దేశంలోకెల్లా ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ప్రజలు, కాంగ్రెస్ కార్యక్తలు, స్నేహతుల తో కలసి సంగారెడ్డి లోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
విగ్రహం ఏర్పాటు కోసం 5 ఎకరాల ప్రయివేటు భూ సేకరణ జరుగుతుందని, ఇందుకోసం ఒక కమిటీ ని కూడా నియమిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. విగ్రహం తయారీ కోసం ఇప్పటి కే హర్యానా రాష్ట్రం కు చెందిన యూనివర్సల్ ఇండియా కంపనీ ని సంప్రదించామని, విగ్రహ భూమి పూజకు PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హజరు అవుతారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
గాంధీ ఆశయాలు , ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసమే ఈ విగ్రహ ఏర్పాటు జరుగుతుందని, గాంధీ విగ్రహం తో పాటు మరో మూడు మహనీయులు విగ్రహలు కూడా సంగారెడ్డి లో ఏర్పాటు చేస్తామని జగ్గారెడ్డి అన్నారు.