సల్మాన్ ఖాన్‌ను లేపేయడానికి స్కెచ్.. నలుగురు అరెస్ట్

సల్మాన్ ఖాన్‌ను లేపేయడానికి స్కెచ్.. నలుగురు అరెస్ట్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై అటాక్ చేసేందకు ప్లాన్ తో ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు. పన్వెల్‌లోని ఫామ్‌హౌస్ సమీపంలో సల్మాన్ కారును ఆపి, AK-47 రైఫిల్స్‌తో కాల్చి చంపాలని ప్లాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు షూటర్లను పన్వేల్ పోలీసులు అరెస్టు చేశారు.

ధనంజయ్ తాప్సింగ్ అలియాస్ అజయ్ కశ్యప్‌, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా,రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్‌పై ఏకే-47 రైఫిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలతో దాడి చేయాలని సూచించిన వీడియోలను అరెస్టు చేసిన వ్యక్తుల మొబైల్ ఫోన్‌ల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ నుంచి డోగా అనే డీలర్ నుంచి  M16, AK-47, AK-92 రైఫిల్స్‌ కొంటున్నట్లు విచారణలో తేలింది. ఈ డీల్ కు కెనడాలోని గోల్డీ బ్రార్ నుంచి డబ్బులు అందుతున్నట్లు తెలిసింది. అజయ్ కశ్యప్ ఈ విషయాలని తన భార్యతో చెప్పినట్టు పోలీసులు ఎవిడెన్స్ సేకరించారు.