సరస్సులో కూలిన విమానం

సరస్సులో కూలిన విమానం

టాంజానీయా: వాతావరణం అనుకూలించక ఒక చిన్న విమానం సహా సరస్సులో కూలిపోయింది. ఆదివారం ఉదయం టాంజానీయాలో జరిగిందీ ప్రమాదం. మరికొద్దిసేపట్లో బుకోబా ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ల్యాండింగ్‌‌ అవుతుందనగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 49 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 26 మందిని కాపాడినట్లు చెప్పారు.

ఈ ఫ్లైట్‌‌ కోస్టల్‌‌ సిటీ అయిన దార్‌‌‌‌– ఎస్‌‌-సలామ్‌‌ నుంచి బుకోబా ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ల్యాండ్‌‌ అవ్వాల్సిన ఉండగా, వాతావరణం అనుకూలించక ప్రమాదం జరిగిందని టాంజానీయా ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీ తెలిపింది. విమానం కూలిన విక్టోరియా సరస్సు వద్ద ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. 100 మీటర్ల ఎత్తులో విమానం వెళుతుండగా వర్షం కురవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.