తేజస్వీ పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచిండు : సింధియా

తేజస్వీ పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచిండు : సింధియా

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య  ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచారన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనతో తేజస్వీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఎంపీ తేజశ్వీ సూర్య పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచారని చెప్పారు. ‘‘ఈ ఘటనలో వాస్తవాలను చూడాలి. ఆ తలుపుల్ని పొరపాటుగా తెరిచారు. విస్తృతంగా తనిఖీలు చేసిన తర్వాత విమానం గమ్యస్థానానికి బయల్దేరింది’’ అని సింధియా తెలిపారు.

చైన్నై నుంచి తిరుచిరపల్లి ఇండిగో  విమానంలో గత నెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లైట్ టేకాఫ్ కు రెడీ అవుతుండగా.. ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసినట్లు ఇండిగో తెలిపింది. అయితే అతడు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొంది. ఈ ఘటనతో మిగిలిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. ఫ్లైట్ టేకాఫ్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.