వనపర్తికి స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్ : చిన్నారెడ్డి

వనపర్తికి స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్ : చిన్నారెడ్డి
  • ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి

వనపర్తి, వెలుగు : వనపర్తికి స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ మంజూరైందని, ఐటీఐ కాలేజీని సెలెక్ట్​ చేసినట్లు రాష్ట్ర ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం వైస్సార్​ జయంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సెంటర్​ ద్వారా కొత్తగా ఆరు ట్రేడ్స్​లో ట్రైనింగ్​ ఇస్తారని, ఇది  నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

అక్టోబరు 2 నుంచి ఈ కోర్సుల్లో శిక్షణ ప్రారంభమవుతుందని, ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆగస్టులో షార్ట్​టర్మ్, అక్టోబర్​లో లాంగ్​టర్మ్​ కోర్సులను ప్రారంభిస్తారని తెలిపారు. శిక్షణ పొందిన వారికి క్యాంపస్​ సెలెక్షన్స్​ నిర్వహిస్తారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు యాదయ్య, బి కృష్ణ పాల్గొన్నారు.