ప్లాస్మా అంటే ఏమిటి? వ్యాక్సిన్ వచ్చే వరకు ప్లాస్మానే కరోనా మందు!

ప్లాస్మా అంటే ఏమిటి? వ్యాక్సిన్ వచ్చే వరకు ప్లాస్మానే కరోనా మందు!
కరోనా వైరస్ బారిన పడి పరిస్థితి విషమించిన పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ఒక వరంలా మారింది. క్రిటికల్ కండిషన్ లో ఉన్న కరోనా పేషెంట్లను బతికించేందుకు డాకర్్ట లుఇప్పుడు ప్లాస్మా ట్రీట్ మెంట్ పై ఫోకస్ పెడుతున్నారు. కరోనాకు టీకాలు, మందులు వచ్చే వరకూ.. సీరియస్ కండిషన్ లోకి వెళ్లే  పేషెంట్లను కాపాడేందుకు ఇదే బెటర్ అని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే పేషెంట్ల బంధువులకు ప్లాస్మా డోనర్లను తీసుకురావాలని సూచిస్తున్నారు. ఒక వ్యక్తినుంచి  తీసుకునే ప్లాస్మాతో ఇద్దరి నుంచి నలుగురిని కాపాడొచ్చని అంటున్నారు.
డోనర్ల కోసం ఎదురుచూపులు..
సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మాథెరపీతో ప్రాణాలు నిలబడే చాన్స్ ఉండటంతో ఇప్పుడు అందరి చూపుప్లాస్మా డోనర వై్ల పు మళింది. పరిస్థితి విషమిస్తున్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేస్తేకోలుకోవచ్చని, ప్లాస్మా డోనర్స్ ను చూసుకోవాలని ఆ పేషెంట్లబంధువులకు డాకర్్ట లుచెప్తున్నారు. దీంతో పేషెంట్లకుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో, తెలిసిన వారి ద్వారా డోనర్స్ కోసం వెతుకుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడెక్కడ ప్లాస్మా డోనర్స్ ఉన్నారో అని తెలుసుకుని మరీ కాల్స్ చేసి రిక్వెస్ట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రిక్వెస్టులూ పెడుతున్నారు. అయినా డోనర్స్ నుంచి సరైన స్పందన రావడం లేదు. ప్లాస్మాను ఇస్తే మళ్లీ  హెల్త్పాడవుతుందేమోనని భయంతో ముందుకు రావడం లేదు.
సర్కారు పట్టించుకుంటలే..
కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్ మెంట్ కోసం మొదట ఢిల్లీప్రభుత్వం ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు  చేసింది. తర్వాత తమిళనాడు, బెం గాల్ వంటి పలు రాష్ట్రాలు కూడా ప్లాస్మా బ్యాంకులు ప్రారంభించాయి. కానీ తెలంగాణ సర్కారు మాత్రం దీనిపై ఇంట్రస్ట్ చూపించడంలేదు. మన రాష్ట్రంలో మొదట గాంధీ హాస్పిటల్ లో డాకర్ రాజారావు ప్లాస్మా థెరపీని ఐదురుగు పేషేంట్లకు చేసి సక్సెస్ అయ్యారు. దాంతో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్స్ వచ్చినా సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్లాస్మా బ్యాంకు పెట్టాలని, దీనిపై అవగాహన కల్పించాలని కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.
అసోసియేషన్ ద్వారా 63 మందికి ప్లాస్మా..
కరోనా నుంచి బయట పడిన కొందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డి తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. డోనర్స్ తో మాట్లాడి అవసరం ఉన్న వారికిప్లాస్మా ఇప్పిస్తున్నారు. తాము 100 మందిని సంప్రదిస్తే.. 15, 20 మంది మాత్రమే ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని నారాయణ రెడ్డిచెప్పారు. డోనర్స్ ముందుకు వస్తున్నా, సరైన అవగాహన లేకపోవడంతో వారికి మళ్లీఏమన్నా అవుతుందేమో నని ఫ్యామిలీ మెంబర్లుఅడ్డుచెప్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అసోసియేషన్ ద్వారా 63 మందికి ప్లాస్మా థెరపీ జరిగినట్లు వెల్లడించారు.
ప్లాస్మా అంటే ఏమిటి?
మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్తకణాలు గుర్తించి, చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల.. సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు.. ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే.. త్వరగా కోలుకుని, ప్రాణాపాయం నుంచి బయటపడే చాన్స్ ఉంటుంది.

మరిన్ని వార్తలు