
తనను, తన నటనను ఇష్టపడిన ప్రతి ప్రేక్షకుడి కోసం ‘భైరవం’ సినిమా చేశాను అని అన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తనతో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్‌గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు.
‘‘నాకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మాస్‌కు కనెక్ట్ అవుతూనే అందరూ రిలేట్ చేసుకునే ఒక రూరల్ స్టోరీలో నటించాలని ఉండేది. అలాంటి సినిమా కోసం చూస్తున్నప్పుడు తమిళ చిత్రం ‘గరుడన్’ కనిపించింది. ఆ కథని మన సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టుగా దర్శకుడు విజయ్ ప్రెజెంట్ చేశారు. రీమేక్ అయినప్పటికీ అందులోని సోల్ మాత్రమే తీసుకుని కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చాలా మార్పులు చేశారు.
అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్‌తో ఉంటుంది. నాతో పాటు మనోజ్, రోహిత్ గార్లకు కెరీర్‌లో చిన్న బ్రేక్ రావడంతో ఇందులోని మా క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు తప్పకుండా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. వాళ్లిద్దరి పాత్రలు సినిమాకు చాలా కీలకం. మా ముగ్గురికి ఈ చిత్రం మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందనే నమ్మకం ఉంది. నాకు జోడీగా నటించిన అదితి శంకర్ పాత్ర చాలా నేచురల్‌గా ఉంటుంది.
తను మంచి సింగర్, డ్యాన్సర్ కూడా. మా ఇద్దరి కాంబినేషన్‌లో మంచి డ్యాన్స్ మూమెంట్స్ కుదిరాయి. ఇక సినిమాలో నాకు పూనకం వచ్చే సీన్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్రహ్మ కడలి గారు వేసిన మ్యాసీవ్ టెంపుల్ సెట్, హరి కే వేదాంత కెమెరా వర్క్ మంచి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి.
నిర్మాత రాధా మోహన్ నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. నన్ను ఫస్ట్ నమ్మిన వ్యక్తి. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈ సినిమాతో అన్నీ సెట్ అయ్యాయి. ప్రతి సినిమాలో కొత్తదనం ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు, కిష్కంధపురి లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తున్నా. ఇవన్నీ ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంటాయి. నాకు నాలుగేళ్ల గ్యాప్ వచ్చినా.. ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఈ ఏడాదంతా మనదే.’’