
‘యానిమల్’ చిత్రంతో ఓవర్ నైట్ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిన త్రిప్తి డిమ్రీ.. ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయింది. తాజాగా మరో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ అందుకుంది. అదికూడా ప్రభాస్‌కు జంటగా. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి పేరును శనివారం ప్రకటించారు. తొమ్మిది భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుండగా, అన్ని భాషల్లోనూ త్రిప్తి పేరుతో ఉన్న పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు.
‘యానిమల్’తో ఆమె కెరీర్‌కు బూస్టప్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో ఆమెకు మరోసారి అవకాశం ఇవ్వడం విశేషం. ప్రభాస్‌తో కలిసి నటించనుండటం, సందీప్ డైరెక్షన్‌లో మళ్లీ వర్క్ చేయనుండటం పట్ల త్రిప్తి సంతోషం వ్యక్తం చేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించాల్సిన దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలొచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే త్రిప్తిని హీరోయిన్‌గా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు సందీప్ రెడ్డి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు.