
ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తెలుగులో విలన్‌గా మెప్పించిన రాహుల్ దేవ్‌కు సోదరుడు ముకుల్ దేవ్. సీరియల్ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ముకుల్.. 1996లో మహేష్ భట్ తెరకెక్కించిన ‘దస్తక్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ చిత్రాల్లో నటించారు.
రవితేజ హీరోగా వచ్చిన ‘కృష్ణ’ చిత్రంతో ఆయన విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అదుర్స్, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ లాంటి చిత్రాల్లో విలన్‌గా నటించారు. ‘అదుర్స్’ సినిమా టైమ్‌లో ముకుల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గొప్ప కళాకారుడిని కాలం తీసుకెళ్లిపోయిందంటూ మనోజ్ బాజ్‌పాయ్ సంతాపం తెలియజేశారు. సోనూసూద్ సహా పలువురు సినీ సెలబ్రిటీస్ ముకుల్‌ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘అంత్ ది ఎండ్’ ముకుల్ దేవ్ చివరి చిత్రం.