సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..!

సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..!

సండే ఫుడ్ అంటే హైదరాబాదీలకు ఠక్కున గుర్తుకొచ్చేది బిర్యానీ.. అందులోనూ దమ్ బిర్యానీ అంటే హాట్ హాట్ గా లాగించేస్తారు జనం.. సండే రోజు హైదరాబాద్ లో హయ్యస్ట్ సేల్స్ సైతం బిర్యానీకే ఉంటాయి. అయితే ఇటీవల బిర్యానీలో అడ్డమైన చెత్త వస్తుంది.. ఫుడ్ సేఫ్ట్ అధికారులు తనిఖీలు చేసినా.. ఆయా రెస్టారెంట్ల తీరు మారటం లేదనేది లెటెస్ట్ కంప్లయింట్ తో తేలిపోయింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీ మణికొండలోని.. టాప్ బిర్యానీ రెస్టారెంట్ ఔట్ లెట్ నుంచి జిలానీ అనే కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే వేడివేడిగా చికెన్ బిర్యానీ ఇంటికి వచ్చింది. ఓపెన్ చేసి సగం తినేశాడు.. ఆ తర్వాత బిర్యానీలోని ప్లాస్టిక్ కవర్ బయటపడింది. బాగా డీప్ ఫ్రై అయిన ప్లాస్టిక్ కవర్ అది.. బిర్యానీలో ఉంది. చాలా పెద్ద ప్లాస్టిక్ కవర్ అది. షాక్ అయిన కస్టమర్ జిలానీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయటంతోపాటు జీహెచ్ఎంసీకి, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేశాడు. 

ఇటీవల కాలంలో చాలా రెస్టారెంట్లలో బోలెడు లోపాలు బయటపడుతున్నాయి. ఆర్డర్ చేసిన ఫుడ్ లో పిన్నులు, బొద్దింకలు వంటివి వస్తున్నాయి. ఇప్పుడు అయితే ఏకంగా ప్లాస్టిక్ కవర్ వచ్చింది.