ఆగస్టు 23న కేర్లో ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరం

ఆగస్టు 23న కేర్లో ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరం

హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారా హిల్స్‌‌‌‌లోని కేర్ హాస్పిటల్స్‌‌‌‌ లో ఆగస్టు 23న ఉచిత రైనోప్లాస్టీ (ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ), ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు  రోడ్ నంబర్ 10లోని దవాఖానలో ఈ క్యాంప్​నిర్వహించనున్నారు.

పెద్దగా లేదా వెడల్పుగా ఉన్న ముక్కు, చిన్నగా లేదా వంకరగా ఉన్న ముక్కు, చదునైన ముక్కు, బయటకు పొడుచుకు కనిపించే చెవులు, ముఖంపై మచ్చలు, కనురెప్పల మడతలు, ముఖ బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారికి నిపుణులు ఉచితంగా పరీక్షలు, సలహాలు అందిస్తారని కేర్ హాస్పిటల్స్‌‌‌‌ క్లినికల్ డైరెక్టర్, ఈఎన్‌‌‌‌టి హెడ్,  చీఫ్ కన్సల్టెంట్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి తెలిపారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం 9908354270 నంబర్​లో సంప్రదించాలని కోరారు.