IPL లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. వీర ఉతుకుడుకు.. మ్యాచ్ గెలిపించినందుకు.. కీలక ఇన్నింగ్స్ ఆడినందుకు.. టీమ్ ను ముందుండి నడిపించినందుకు ఇస్తుంటారు కదా. అయితే ఈ అవార్డు విషయంలో కొత్త రికార్డు నమోదయ్యే ఛాన్స్ ఉందా..? సెహ్వాగ్, కలిస్, కోహ్లీ, బట్లర్ లాంటి తోపులకు సాధ్యం కానిది.. ఒక యంగ్ ప్లేయర్.. అదికూడా ఇప్పటికీ టీమిండియాలో ప్లేస్ సాధించని అనామకుడు అందుకోనున్నాడా..? క్రికెట్ సర్కిల్ లో ఇప్పుడంతా ఇదే చర్చ.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డును హ్యాట్రిక్ గా అందుకున్న ఎంతో మంది స్టార్స్ కు ఇప్పుడు సమీర్ రజ్వీ రూపంలో కొత్త ఛాలెంజ్ ఎదురవుతోంది. అప్పట్లో సెహ్వాగ్, జాక్వెస్ కలిస్, ఆరోన్ ఫించ్.. ఇప్పట్లో కోహ్లీ, బట్లర్, రుతురాజ్ లాంటి వాళ్లు వరుసగా మూడు సార్లు అందుకున్నా.. నాలుగో సారి అందుకున్న మొనగాడు మాత్రం ఇంకా హిస్టరీలో చేరలేదు. శనివారం (ఏప్రిల్ 04) ముంబైపై 90 రన్స్ తో ఢిల్లీని గెలిపించిన సమీర్ రిజ్వీ.. హ్యాట్రిక్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు తీసుకోవడంతో ఆ చర్చ మళ్లీ మొదలైంది. రిజ్వీ వరుసగా4వ అవార్డు అందుకుంటాడా..? కోహ్లీ లాంటి ప్లేయర్స్ కు సాధ్యం కానిది రిజ్వీ చేసి చూయిస్తాడా..? అని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
హ్యాట్రిక్ అందుకున్న ప్లేయర్స్ లిస్టు:
జాక్వెస్ కలిస్:
ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సారి హ్యాట్రిక్ అవార్డు అందుకున్న ప్లేయర్ సౌతాఫిక్రా ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్. 2010 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కలిస్, కింగ్స్ XI పంజాబ్ జట్టుపై 55 బంతుల్లో 89* పరుగులు చేసి, 39 పరుగులకు 1 వికెట్ తీసి తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు . దీంతో ఆర్‌సిబి ఏడు బాల్స్ మిగిలి ఉండగానే 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, 34 బంతుల్లో 44* పరుగులు చేసి, 20 పరుగులకు 2 వికెట్లు తీసి, పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ మ్యాచ్‌లో రాణించాడు. ఇక ముంబై ఇండియన్స్‌పై 55 బంతుల్లో 66* పరుగులు చేసి, 35 పరుగులకు 1 వికెట్ తీసి తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో ఆ జట్టు 152 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడంలో సహాయపడ్డాడు. మూడు హ్యాట్రిక్ POTM అవార్డు సాధించిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు.
- వీరేందర్ సెహ్వాగ్
సెహ్వాగ్ 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్‌గా ఈ అవార్డును గెలుచుకున్నాడు. పూణే వారియర్స్‌పై అజేయంగా 87 పరుగులు చేసి , 24 బంతులు మిగిలి ఉండగానే DDని గెలిపించాడు. తర్వాతి రెండు అవార్డులు ముంబై ఇండియన్స్‌పై 39 బంతుల్లో 73 పరుగులు చేసి DD స్కోరును 200 దాటించాడు, ఆపై రాజస్థాన్ రాయల్స్‌పై మరో 39 బంతుల్లో 63 పరుగులతో ఉత్కంఠభరితమైన ఒక పరుగు విజయాన్ని అందించాడు .
ఆరోన్ ఫించ్
ఫించ్ సాధించిన మూడు మ్యాచ్ విన్నింగ్ అర్ధ సెంచరీలు అతనికి వరుసగా మూడు అవార్డులను సంపాదించిపెట్టాయి. గుజరాత్ లయన్స్ తరఫున ఆడుతూ, ఫించ్ కింగ్స్ XI పంజాబ్ , రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లను ఓడించాడు . అవన్నీ వరుసగా 162, 164 మరియు 144 పరుగుల ఛేజింగ్‌లలోనే వచ్చాయి. వాంఖేడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, 54 బంతుల్లో 67* పరుగులతో లయన్స్‌ను గెలిపించి మ్యాట్రిక్ అందుకున్నాడు.
- విరాట్ కోహ్లీ
2016 సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ తో 81.08 యావరేజ్ తో రికార్డు స్థాయిలో 973 పరుగులు సాధించి, హ్యాట్రిక్ అవార్డులను అందుకున్నాడు . 147, 120 స్ట్రైక్ రేట్లతో సాధించిన రెండు హాఫ్ సెంచరీలు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఆర్‌సీబీని గెలిపించాయి. కింగ్స్ XI పంజాబ్‌పై 50 బంతుల్లో 12 ఫోర్లు , ఎనిమిది సిక్సర్లతో చేసిన 113 పరుగుల ఇన్నింగ్స్ ఈ ఛేజింగ్ మాస్టర్ కు చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
- జోస్ బట్లర్
2018లో బట్లర్ హ్యాట్రిక్ అవార్డు అందుకుని కల నిజం చేసుకున్నాడు. కింగ్స్ XI పంజాబ్ (82), చెన్నై సూపర్ కింగ్స్ (95*) జట్లతో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో బట్లర్ బ్యాట్ నుంచి కురిసిన ఫోర్ల వర్షం ఇప్పటికీ ఫ్యాన్స్ మరిచిపోలేరు.- వరుసగా 9 మరియు 11 ఫోర్లు కొట్టగా, మొత్తం మీద కేవలం మూడు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 94* పరుగులు చేసి, మొత్తం ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 169 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడంలో సహాయపడింది. ఈ సీజన్ లో హ్యాట్రిక్ అవార్డు అందుకుని రికార్డు సృష్టించాడు.
- రుతురాజ్ గైక్వాడ్
తన తొలి ఐపీఎల్ సీజన్ లో రుతురాజ్ హ్యాట్రిక్ అవార్డు అందుకోవడం అప్పట్లో సెన్సేషన్. ఐపీఎల్ 2020 సెకండ్ హాఫ్ లో గైక్వాడ్ వరుసగా మూడో అవార్డును గెలుచుకున్నాడు. అతని మూడు హాఫ్ సంచరీలు దుబాయ్, అబుదాబిలలో చైన్నై టీమ్ మూడు లక్ష్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషించాయి. మొదట ఆర్‌సీబీపై 65*, ఆ తర్వాత కేకేఆర్‌పై 72 , చివరగా కేఎక్స్ఐపీపై 65* పరుగులు చేశాడు జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సమీర్ రిజ్వీ
ఈ ఐపీఎల్ సీజన్ (2026)లో ఎక్కువగా మారుమోగుతున్న పేరు సమీర్ రిజ్వీ.2025లో పంజాబ్ కింగ్స్‌పై 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 25 బంతుల్లో 58 రన్స్ చేసి రిజ్వీ DC IPL 2025 సీజన్ ను ముగించింది. ఇక ఈ సీజన్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 47 బంతుల్లో 70 పరుగులు చేసి కెరీర్ లో రెండో అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలో 51 బంతుల్లో 90 పరుగులు చేసి MI బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎక్కడా తొణకకుండా.. కాన్ఫిడెంట్ షాట్స్ ఆడుతూ గెలుపును ముద్దాడుతున్న ఈ ప్లేయర్ వరుసగా హ్యాట్రిక్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. వచ్చే మ్యాచులో కూడా ఇదే జోరుతో అవార్డు అందుకుంటే.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగో సారి అవార్డు అందుకున్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన ప్లేయర్ అవుతాడు.
