రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మౌలిక వసతుల కల్పనపై వివరాలివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ భర్తీకి తీసుకున్న చర్యలపై కౌంటర్ వేయాలంది. సర్కార్ దవఖానాల్లో మౌలిక వసతులు లేకపోవడం, సిబ్బందిని నియమించకపోవడంపై హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అఖిల్ శ్రీగురుతేజ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌ల బెంచ్ విచారించింది.
పిటిషనర్ తరఫు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. 4,343 డాక్టర్ పోస్టులు మంజూరుకాగా.. 67% పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వాదనలు విన్న బెంచ్.. సీఎస్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డీఎంఈ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులిస్తూ.. కౌంటర్ జారీ చేయాలంది.
