సబ్సిడీలను సకాలంలో ఇప్పించండి: మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి

సబ్సిడీలను సకాలంలో ఇప్పించండి: మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావలసిన సబ్సిడీలను సకాలంలో విడుదల చేయించాలని ఉమ్మడి మెదక్ ​జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ కోరారు. మంగళవారం హైదరాబాద్​లో జిల్లా సమస్యలపై మంత్రిని కలిశారు. జగన్ మాట్లాడుతూ.. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రావాల్సిన సబ్సిడీలు, విద్యార్థులకు రావలసిన స్కాలర్​షిప్​లను విడుదల చేయించాలని కోరినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించనట్లు వెల్లడించారు.