జీడిమెట్ల, వెలుగు: కొండాపూర్‌కు చెందిన జయశ్రీ (56)కి ప్రగతినగర్, వాసవి ఎన్‌క్లేవ్‌లో 244 గజాల స్థలం ఉంది. ఎల్లమ్మబండకి చెందిన సారాయి కృష్ణ, బహదూర్‌పల్లికి చెందిన కమ్మరి కుమార్కలిసి జయశ్రీ పేరుతో ఫేక్ ఆధార్ కార్డును సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్మారు. ఇటీవల జయశ్రీ ఈసీ తీయగా తన ప్లాట్ కృష్ణకు అమ్మినట్టుగా వచ్చింది. దీంతో బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నిందితులు కృష్ణ, కుమార్ ను గురువారం అరెస్ట్ చేశారు.
